శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (10:42 IST)

చైనాలో కరోనా వైరస్ మ్యత్యుఘోష.. 1662కి చేరిన మరణాలు

కరోనా వైరస్ (కోవిడ్-19) మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం. దీంతో మృతులు సంఖ్య 1662కు చేరింది. కాగా, కొత్తగా మరో 1843 మందికి ఈ వైరస్ సోకింది.

ఇక, భార‌త దేశ‌ వ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య 69 వేలకు చేరింది. అయితే, 9465 మంది ఈ వైర‌స్ బారి నుంచీ బయటపడడం కాస్త ఊరటనిచ్చే అంశం.. కాగా, సింగపూర్‌లో తాజాగా మరో ఐదుగురికి ఈ వైరస్ సోకడంతో ఆ దేశంలో ఆ వైర‌స్ బాధితుల సంఖ్య 72కు చేరింది.
 
మరోవైపు కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19)‌తో ఐరోపాలోనే తొలిసారిగా ఒకరు ఫ్రాన్స్‌లో చనిపోయారు. ఆసియా వెలుపల మొదటి మరణం కూడా ఇదే. మృతుడు చైనా నుంచి వచ్చిన పర్యాటకుడని, ఆయన వయసు 80 ఏళ్లని ఫ్రాన్స్ ఆరోగ్యశాఖ మంత్రి ఆగ్నెస్ బుజిన్ చెప్పారు. ఈ పర్యటకుడు చైనాలోని హుబే రాష్ట్రానికి చెందినవారని తెలిపారు. ఆయన జనవరి 16న ఫ్రాన్స్ చేరుకున్నారని, 25 నుంచి ఆస్పత్రిలో ఒంటరిగా ఉంచామని మంత్రి వివరించారు.