బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఫిలిప్పీన్స్‌లో రాయ్ తుఫాను విధ్వంసం - 208 మంది మృతి

ఫిలిప్పీన్స్ దేశంలో రాయ్ తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను ధాటికి ఆ దేశంలో అపారమైన ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లింది. ఈ తుఫాను వల్ల ఇప్పటివరకు దాదాపు 208 మంది మృత్యువాతపడ్డారు. మరో 250 మందివరకు గాయపడ్డారు. 52 మంది గల్లంతు అయ్యారు. ఇటీవలి కాలంలో ఈ దేశంలో తుఫాను ధాటికి ఇంత మంది ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
కాగా, ఆర్చిపెలాగోలేని సౌథర్న్, సెంట్రల్ రీజియన్లలో సుమారు 239 మంది ఈ తుఫాను వల్ల గాయపడ్డారు. మరో 52 మంది గల్లంతయ్యారు. కోస్తా ప్రాంతమంతా తుఫానుధాటికి తుడిచిపెట్టుకుని పోయిందని ఫిలిప్పీన్స్ రెడ్‌క్రాస్ సంస్థ తెలిపింది. 
 
అలాగే దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతింది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ తుఫాను వల్ల నిరాశ్రయులైన లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆ దేశ అధికారులు వెల్లడించారు.