శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 మే 2020 (15:43 IST)

కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పలేం?

ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడం అసాధ్యమని ఇంపీరియల్ కాలేజీ ఆప్ లండన్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ నబారో చెప్తున్నారు. గతంలో ఎయిడ్స్, డెంగ్యూ లాంటి వైరస్‌లకు కూడా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం కరోనాను కట్టడి చేసేందుకు 100కి పైగా వ్యాక్సిన్లు ప్రీ- క్లినికల్ ట్రయిల్స్ దశలో ఉన్నాయని.. ఇక వాటిల్లో కొన్ని హ్యూమన్ ట్రయిల్ దశకు చేరుకున్నాయని వెల్లడించారు. 
 
ఇప్పటికీ చాలా వైరస్‌లకు విరుగుడు దొరకలేదని.. ఒకవేళ కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా అది సమర్ధవంతంగా పని చేస్తుందని చెప్పలేమన్నారు. కాగా, ప్రస్తుతం డేవిడ్ నబారో ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్‌ 19 సలహాదారుగా పని చేస్తున్నారు.