శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 మే 2017 (16:57 IST)

అంతర్జాతీయ కోర్టులో పాక్‌కు చుక్కెదురు.. కులభూషణ్ ఉరిశిక్షపై స్టే..

భారత మాజీ నావికా దళ అధికారి కులభూషణ్ జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట లభించింది. కులభూషణ్ జాదవ్ గూఢచర్యం చేశారని ఆరోపిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిప

భారత మాజీ నావికా దళ అధికారి కులభూషణ్ జాదవ్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఊరట లభించింది. కులభూషణ్ జాదవ్ గూఢచర్యం చేశారని ఆరోపిస్తూ పాకిస్థాన్ మిలిటరీ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించిన భారత్-పాకిస్థాన్ న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. 
 
ఈ విచారణ అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి రాదనే పాకిస్తాన్ వాదనను అంతర్జాతీయ న్యాయస్థానం తోసిపుచ్చింది. హేగ్‌లో 11 మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్.. కులభూషణ్ జాదవ్ గూఢచర్యం చేశారన్న పాక్ ఆరోపణలను తోసిపుచ్చింది. వియన్నా ఒప్పందాన్ని భారత్- పాకిస్థాన్‌లు గౌరవించాలని ఈ కోర్టు అధ్యక్షుడు రోనీ అబ్రహాం సూచించారు.
 
కులభూషణ్ దౌత్యాధికారులను కలుసుకునే అవకాశం కల్పించాలని కూడా న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు జాదవ్ ఉరిశిక్షపై స్టే విధించింది. ఆయనను ఉరితీయబోమని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని కూడా రోనీ ఆదేశించారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలతో జాదవ్ నిర్ధోషి అని తేలింది.