శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 21 జనవరి 2019 (14:30 IST)

మే 1, 2019.. ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి వైదొలిగారని వాషింగ్టన్ పోస్టు సంచలన వార్తను ప్రచురించింది. అందరూ ఊహించిందే.. ట్రంప్ వైట్ హౌస్ నుంచి తప్పుకున్నారంటూ వాషింగ్టన్ పోస్టు ప్రచురించడం ప్రస్తుతం నెట్టింట వైరలై కూర్చుంది. ఇంకా ట్రంప్ శతాబ్ధం ముగిసిందని.. ఇది ప్రపంచ వ్యాప్తంగా పండగ చేసుకోవాల్సిన వార్తంటూ శీర్షిక పెట్టింది. 
 
అంతేకాకుండా.. ఆ వార్తా పత్రికను మే 1, 2019 అనే తేదీతో విడుదల చేసింది. కానీ ట్రంప్ తన పదవి నుంచి తప్పుకున్నారని వచ్చిన వార్తతో కూడిన పత్రికను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ పత్రిక ప్రచురించే వార్తలపై అంత శ్రద్ధ పెట్టక్కర్లేదని నెటిజన్లు అంటున్నారు. అంతేగాకుండా ఈ వార్తా పత్రిక నకిలీదని.. ఈ వార్తకు సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ది వాషింగ్టన్ పోస్టు స్పష్టం చేసింది.