శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (18:31 IST)

చైనాలో వైన్ తాగి తేయాకు తోటలో తూగిన ఏనుగులు.. ఫోటోలు వైరల్

Elephants
ఏనుగులు వైన్ తాగి తోటలో తూలిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌ అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి 14 ఏనుగులు అక్కడున్న తేయాకు తోటలోకి ప్రవేశించాయి. పరిసరాల్లో ఇళ్లను ధ్వంసం చేశాయి. 
 
ఇలా ఓ ఇంట్లో వుంచిన 30 లీటర్ల వైన్‌ను రెండు ఏనుగులు ఫూటుగా తాగాయి. అంతే మత్తులో తూగిన ఏనుగులు తేయాకు తోటలో తిరుగుతూ.. ఒక దశలో తోటలోనే నిద్రపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.