గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2020 (14:41 IST)

కరోనా వైరస్.. మరణాల్లో చైనాను దాటేసిన ఇటలీ

కరోనా వైరస్ మహమ్మారి మరింతగా వ్యాపిస్తోంది. శుక్రవారానికి ఈ వైరస్ ఏకంగా 180 దేశాలకు విస్తరించింది. అలాగే, కరోనా వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఇటలీలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది. కరోనా మృతుల్లో చైనాను ఇటలీదాటిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 10048గా నమోంది. ఇందులో ఒక్క ఇటలీలోనే ఏకంగా 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2.45 లక్షలకు చేరితే, ఒక్క ఇటలీలోనే 41 వేల మందికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇటలీలో గడిచిన 24 గంటల్లో 427 మంది మృతి చెందారు. చైనాలో వరుసగా రెండో రోజూ కొత్తగా కరోనా కేసులు నమోదు కాకపోవడంతో చైనా పాలకులతో పాటు.. ఆరోగ్య శాఖ అధికారులు ఊపిరి  పీల్చుకున్నారు. 
 
ఇకపోతే, ఇరాన్‌లో 1,284, స్పెయిన్‌లో 831, ఫ్రాన్స్‌లో 372, అమెరికాలో 218, యూకేలో 144, దక్షిణ కొరియాలో 94, నెదర్లాండ్స్‌లో 76, జర్మనీలో 44, స్విట్జర్లాండ్‌లో 43 మంది మృతి చెందారు. అదేవిధంగా మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 195కు చేరుకోగా, మృతుల సంఖ్య ఐదుకు చేరింది. వీరంతా 60 యేళ్ళ పైబడినవారే కావడం గమనార్హం.