శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (14:54 IST)

గర్భం ధరించిన మహిళా ఉద్యోగిని.. శరీరాకృతి మారిందని.. ఉద్యోగాన్ని ఊడగొట్టారు..

గర్భం ధరించిన కారణంగా ఏ మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి ఊడగొట్టిన సంస్థపై సదరు మహిళ కేసు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని నెట్ ఫిక్స్ కంపెనీలో పనిచేసిన థానియా అనే మహిళ.. ఆ సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఒరిజినల్స్ విభాగంలో మేనేజర్‌గా పనిచేస్తూ వచ్చారు. గత 2018వ సంవత్సరం నవంబర్ నెల తానియా తాను గర్భం ధరించిన విషయాన్ని తన స్నేహితులకు పంచుకుంది. 
 
ఆపై గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికా ఫ్రాన్సిస్కో రమోస్.. ఆమెను విమర్శించడమే కాకుండా ఎలాంటి ప్రకటన చేయకుండా ఉద్యోగం నుంచి తొలగించాడు. దీంతో తానియా ఫ్రాన్సిస్కోపై ఫిర్యాదు చేసింది. 
 
తాను గర్భం దాల్చడం ద్వారా శరీరాకృతిలో ఏర్పడిన మార్పులపై కూడా ఫ్రాన్సిస్కో కామెంట్ చేశారని తెలిపింది. అంతేగాకుండా తనకు ఇవ్వని జీతం, బోనస్, మానసిక వేదనకు నష్టపరిహారం కావాలని నెట్ ఫ్లిక్స్ సంస్థపై లాస్ ఏంజెల్స్ కోర్టులో తానియా ఫిర్యాదు చేసింది. అయితే తానియా చేసే ఫిర్యాదులో నిజం లేదని.. ఎప్పటికీ ఉద్యోగులు, వారి కుటుంబాలపై తమ సంస్థ ప్రత్యేక దృష్టి సారిస్తుందని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.