ఆఫ్రికా దేశాల్లో పంజా విసురుతున్న ఎబోలా: ఐదుగురు మృతి
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. ఈ వైరస్ ఇంకా కనుమరుగు కాకముందే మళ్ళీ మరో ప్రాణాంతక వైరస్ పురులువిప్పిందని తెలుస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఎబోలా పంజా విసురుతుంది. గినియాలో ఈ వైరస్ బారిన పడిన ఇప్పటికే ఐదుగురు మరణించారు.
భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ వైరస్ మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆఫ్రికాలోని మరో ఆరు దేశాలను అలర్ట్ చేసింది.
గినియాలో 109 కేసులు నమోదు కాగా ఐదుగురు మరణించారు. ఇక మరోవైపు కాంగో దేశంలోనే ఇప్పటివరకు 300 ఎబోలా కేసులను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మార్గరెట్ హారిస్ తెలిపారు.
వీటితో పాటు మరో రెండు దేశాల్లోనూ ఎబోలా కేసులు గుర్తించినట్లు సమాచారం. వాటి మూలాలను తెలుసుకునేందుకు నమూనాలను పరీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.