మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (12:51 IST)

మోడీ జీ.. ప్లీజ్... ఒకే ఒక్క ఛాన్సివ్వండి.. ప్రాధేయపడుతున్న ఇమ్రాన్

పుల్వామా ఉగ్రదాడి తర్వాత్ పాకిస్థాన్‌పై భారత్ ఏ క్షణమైనా దాడి చేసేందు సిద్ధంగా ఉంది. దీంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. ఒకవేళ భారత్ దాడి చేస్తే దాన్ని తిప్పికొట్టేందుకు వీలుగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల వెంబడకు తరలిస్తోంది. అలాగే సైన్యాన్ని కూడా భారీ సంఖ్యలో సరిహద్దులకు తరలిస్తోంది. 
 
ఇదిలావుంటే, పూల్వామా దాడికి సరైన ఆధారాలు చూపాలంటూ మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు గొంతు సవరించుకున్నారు. మీరు నిజంగా పఠాన్ బిడ్డైతే... ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న మోడీ విసిరిన సవాల్‌కు స్పందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఇమ్రాన్ చెప్పారు. 
 
అయితే దీనికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో భారత్ ఉగ్రదాడికి సంబంధంచి సరైన ఆధారలు అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొంది. దీంతో పాటు శాంతికి కూడ భారత్ ఓ అవకాశం ఇవ్వాలని ఇమ్రాన్ అందులో కోరారు.
 
పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నికైన సందర్భంగా మోడీ పేదరికం, నిరక్షరాస్యతపై కలిసి పోరాడుదామంటూ ఇమ్రాన్‌కు పిలుపునిచ్చారు. దీనికి ఇమ్రాన్‌ స్పందిస్తూ.. తాను పఠాన్‌ వంశస్థుడినని, ఇచ్చిన మాట తప్పమని బదులిచ్చారు. ఆ సందేశాన్ని ఇప్పుడు ఉటంకిస్తూ పఠాన్‌ బిడ్డవైతే చర్యలు తీసుకోవాలంటూ మోడీ సవాల్‌ విసిరారు. 
 
అయితే పుల్వామా దాడి వెనక పాకిస్థాన్‌ హస్తం ఉందన్న భారత్‌ వాదనను ఇమ్రాన్‌ఖాన్‌ గతంలో తోసిపుచ్చారు. ఆధారాలుంటే చూపాలని సవాల్‌ విసిరారు. ఇంతలోనే దాడికి పాల్పడిన జైష్ ఇ మొహమ్మద్ ఈ దాడికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టింది. దీంతో ఏం చేయాలో తెలియని పాకిస్థాన్.. ఇపుడు మోడీ శరణు వేడుతోంది. ప్లీజ్.. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడుతోంది.