శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 26 మే 2018 (10:23 IST)

భారతీయ మహిళ సవిత మృతితో గర్భస్రావంపై ఐర్లాండ్ రెఫరెండం

2012 అక్టోబరులో ఓ భారతీయ మహిళ సవిత హలప్పనావర్ ఐర్లాండ్‌లో అబార్షన్ చేయకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. తల్లి ప్రాణానికి, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ప్రాధాన్యం ఇచ్చే ఐరిష్ ప్రభుత్వం గర్భస్రావంపై ఎన్నో

2012 అక్టోబరులో ఓ భారతీయ మహిళ సవిత హలప్పనావర్ ఐర్లాండ్‌లో అబార్షన్ చేయకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయింది. తల్లి ప్రాణానికి, పుట్టబోయే బిడ్డ ప్రాణానికి ప్రాధాన్యం ఇచ్చే ఐరిష్ ప్రభుత్వం గర్భస్రావంపై ఎన్నో ఏళ్లుగా కఠిన చట్టాలు అమలు చేస్తోంది. కేథలిక్ దేశమైన ఐర్లండ్‌లో ఈ చట్టాలను ఉల్లంఘిస్తే 14 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 
 
అయితే, అదే చట్టం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని ప్రజలు ప్రభుత్వంపై తిరగబడ్డారు. మహిళ ప్రాణాలు తీసే ఇటువంటి చట్టాలను ఎత్తివేయాలంటూ ఉద్యమం మొదలు పెట్టారు. 
 
ఈ ఉద్యమానికి ప్రభుత్వం ప్రస్తుతం దిగొచ్చింది. ఫలితంగా గర్భస్రావంపై రెఫరెండం నిర్వహించింది. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నేడు రెఫరెండం ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఓటింగ్‌లో ప్రధాని లియో వారడ్కర్ కూడా ఓటు వేశారు.