గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఆగస్టు 2022 (10:40 IST)

ఇజ్రాయెల్‌లో వైమానిక దాడులు.. పది మంది మృతి

Israeli strike
Israeli strike
ఇజ్రాయెల్‌లో జరిగిన వైమానిక దాడుల్లో ఒక సీనియర్ మిలిటెంట్‌తో సహా దాదాపు పది మంది దాకా చనిపోయినట్టు తెలుస్తోంది. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఒక సీనియర్ మిలిటెంట్‌ను అరెస్టు చేసిన దానికి ప్రతిస్పందనగా ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్ గ్రూపును లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
చనిపోయిన వారిలో ఐదేళ్ల బాలిక కూడా ఉందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. మిగిలిన వారు మిలిటెంట్లా లేక పౌరులా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. చనిపోయిన వారిలో ఉత్తర గాజా కమాండర్ తైసీర్ అల్-జబారీ కూడా ఉన్నారని ఇస్లామిక్ జిహాద్ తెలిపింది.