శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (13:52 IST)

బీజీఎంఐ ముసుగులో చైనా కుట్ర... తిప్పికొట్టిన భారత్

BGMI
BGMI
చైనా వక్రబుద్ధి మళ్లీ బయటపడింది. అయితే భారత్ లక్ష్యంగా చైనా చేస్తున్న కుట్రల్ని కేంద్రం భగ్నం చేసింది. బీజీఎంఐ ముసుగులో.. భారత్‌ యూజర్ల డేటాను తస్కరించి, ఆ డేటాతో సైబర్‌ దాడులు జరిపేందుకు చైనా ప్రయత‍్నించిందని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి. 
 
అలాగే పబ్జీకి ప్రత్యామ్నాయంగా విడుదలైన బీజీఎంఐ గేమ్‌తో చైనా గూఢా చార్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ప్లే అవుతున్న బీజీఎంఐ గేమ్‌కు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని, కాబట్టే అండర్‌ సెక్షన్‌ 69ఏ ఐటీ యాక్ట్‌ కింద యాప్‌ స్టోర్‌ల నుంచి ఆ గేమ్‌ను బ్లాక్‌ చేసినట్లు పేర్కొంది.
 
భారత్‌ బ్యాన్‌ విధించిన బీజీఎంఐ యాప్‌లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఆ యాప్‌లో ప్రమాదకరమైన కోడ్‌లు ఉన్నాయి. వాటి సాయంతో చైనాలో ఉన్న సర్వర్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఈ కోడ్ సాయంతో యూజర్లపై నిఘా, వారి డేటాను దొంగిలించి దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇందుకు తగినట్లు యాక్సిస్ అమర్చింది.