శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మార్చి 2020 (17:44 IST)

కరోనా వైరస్.. నమస్కారం మేలు.. ముద్దు వద్దే వద్దు..

కరోనా వైరస్ సోకకుండా వుండాలంటే... షేక్ హ్యాండ్‌ను మరిచిపోవాలని... నమస్కారం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్లు వాడటం, చేతులను శుభ్రంగా వుంచుకోవడం ద్వారా కరోనా వైరస్‌ను నియంత్రించుకోవచ్చు. ఇంకా ఫ్లూ, దగ్గు వున్న వారి నుంచి పది మీటర్ల మేర దూరంగా వుండటం ద్వారా కరోనా బారిన పడకుండా తప్పించుకోవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
 
ఇంకా కరోనా వైరస్ సోకకుండా వుండాలంటే.. దగ్గేటప్పుడు లాలాజల బిందువులు ఇతరులపై పడకుండా చూసుకోవాలి. అందుకే ముద్దు ఇవ్వడం.. కూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ కలిగిన శ్లేష్మం, లాలాజల బిందువుల కారణంగా ఇది వ్యాప్తి చెందుతుందని, వాటిని నిలువరిస్తే ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే లిప్ కిస్‌లు కూడదని.. ముద్దు కచ్చితంగా వైరస్ వ్యాప్తి చేయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.