సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (10:40 IST)

స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం: భూటాన్ పర్యటనలో మోడీ

ప్రధాని నరేంద్రమోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ చేరుకున్నారు. పారో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భూటాన్ ప్రధాని లోటే ఘన స్వాగతం పలికారు. సైనిక బలగాల వందనం స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా భూటాన్‌తో విద్య, వైద్య తదితర రంగాల్లో 10 అవగాహనా ఒప్పందాలు కుదరనున్నాయి. 
 
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, థింపూలో ఇస్రో నిర్మించిన ఎర్త్ స్టేషన్ సహా ఐదింటిని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. పొరుగు స్నేహ దేశాలకే తొలి ప్రాధాన్యం అన్నది భారత విధానమని ప్రధాని మోడీ అన్నారు. భారత్ - భూటాన్‌ది బలమైన బంధం అని చెప్పారు. ప్రధాని మోడీ భూటాన్ వెళ్లడం ఇది రెండోసారి. రెండోదఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి విదేశ పర్యటన కూడా ఇదే.