మళ్లీ వాయిదాపడిన నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) చేపట్టదలచిన ఆర్టెమిస్-1 ప్రయోగం మరోమారు వాయిదాపడింది. నిజానికి గత నెల 29వ తేదీనే ఈ ప్రయోగం చేపట్టాల్సింది. చివరి నిమిషలో రాకెట్‌లో ఇంధన లీకేజీ కారణంగా తొలిసారి వాయిదాడింది. దీంతో శనివారం ఈ ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలని భావించారు. కానీ, గతంలో ఉత్పన్నమైన సమస్యే తిరిగి పునరావృత్తమైంది. దీంతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
గత నెల 29వ తేదీన ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్టన్టు ప్రకటించిన నాసా తిరిగి ఈ నెల 3వ తేదీ ప్రయోగించనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. శనివారం కూడా గతంలో తలెత్తిన సమస్యే తలెత్తింది. రాకెట్‌లోని మూడో నంబరు ఇంజిన్‌లో ఇంధన లీకేజీ కనిపించగా దానిని సరిదిద్దేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో వరుసగా రెండో పర్యాయం కూడా ఆర్టెమిస్-1 ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. అయితే, ఈ ప్రయోగాన్ని తిరిగి ఎపుడు చేపట్టనున్నదీ మాత్రం నాసా శాస్త్రవేత్తలు వెల్లడించలేదు.