సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జులై 2024 (16:25 IST)

నేపాల్‌లో కుప్పకూలిన విమానం.... 18 మంది దుర్మరణం

Plane Crash
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆ సమయంలో విమానంలో 19 మంది ఉండగా, వీరిలో 18 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం బుధవారం ఉదంయ 11 గంటల సమయంలో జరిగింది. ఈ విమానం... ఖాట్మండు నుంచి పోఖారాకు వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విషయం తెలియగానే ప్రమాదస్థలికి పోలీసులు, అగ్నిమాపదక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు చలరేగడంతో ఆర్పివేశారు. 
 
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలను వెలికి తీశారు. విమానం పైలెట్ కెప్టెన్ మనీష్ షాక్యాను రక్షించిన సిబ్బంది.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టేకాఫ్ సమయంలో్ రన్‌వే పై నుంచి విమానం జారిపోవడం వల్లే కూలిపోయివుంటుందని శౌర్య ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.