గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (18:22 IST)

మ‌హిళ‌ల గురించి ఒబామా ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్.. ఏమన్నారో తెలుసా? (video)

అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఆడ‌వాళ్ల గురించి కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. సింగ‌పూర్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న‌.. పురుషుల క‌న్నా ఆడ‌వాళ్లే బెట‌ర్ అన్న అభిప్రాయాన్ని వినిపించారు. దీంట్లో ఎటువంటి సందేహాం లేద‌న్నారు. 
 
ఎటువంటి వాద‌న‌లు కూడా అవ‌స‌రం లేద‌న్నారు. ఒక‌వేళ ఈ ప్రపంచంలోని ప్ర‌తి దేశాన్ని మ‌హిళే ఏలితే.. అప్పుడు జీవ‌న ప్ర‌మాణాలు మ‌రింత వృద్ధి సాధిస్తాయ‌న్నారు. అన్ని విష‌యాల్లో మ‌హిళ‌లు ఫ‌ర్ఫెక్ట్ కాదు, కానీ పురుషుల క‌న్నా వారు బెట‌ర్ అన్న‌ది మాత్రం నిర్వివాదాంశం అన్నారు. 
 
ప్ర‌పంచంలో చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు వృద్ధుల వ‌ల్ల ఉత్ప‌న్నం అయ్యాయ‌ని, దాంట్లో ఎక్కువ శాతం మ‌గ‌వారు అధికారంలో ఉండ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల ఎక్కువ దుష్ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్నారు. 
 
మ‌హిళ‌లు రాజ్యాధికారాన్ని చేప‌డితే, అప్పుడు ఈ ప్ర‌పంచం ఎలా ఉంటుందో అని తాను అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలో ఊహించ‌కునేవాడిన‌ని బ‌రాక్ ఒబామా తెలిపారు. ప్ర‌తి దేశాన్ని ఓ రెండేళ్ల పాటు మ‌హిళ‌లు ఏలితే, అప్పుడు అన్ని రంగాల్లో పురోగ‌తి క‌నిపిస్తుంద‌న్నారు. 
 
ఉద్యోగం చేయ‌డానికి మాత్రమే తామున్నామ‌న్న విష‌యాన్ని రాజ‌కీయ నేత‌లు గుర్తుంచుకోవాల‌ని ఒబామా అన్నారు. జీవితం మొత్తం రాజ‌కీయాలే కాదు అని, అధికారాన్ని అనుభ‌వించ‌డం ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌న్నారు.