ఎఫ్-16 ఫైటర్ జట్లను ఎందుకు దుర్వినియోగం చేశారు : నిలదీసిన అమెరికా
పాకిస్థాన్ - అమెరికా దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందాల్లో భాగంగానే పాకిస్థాన్‌కు ఎఫ్-16 రకం యుద్ధ విమానాలను అమెరికా సరఫరా చేసింది. అయితే, పాకిస్థాన్ మాత్రం ఈ రకం విమానాలను దుర్వినియోగం చేసింది. ఈ అంశంపై పాకిస్థాన్ను అమెరికా నిలదీసింది.
ఇరు దేశాల మధ్య ఉన్న భద్రతా ఒప్పందాలను పాక్ ఉల్లంఘించినట్లు అగ్రరాజ్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ ఎయిర్ చీఫ్ మార్షల్ ముజాహిద్ అన్వర్ ఖాన్‌కు అమెరికా ఆర్మ్స్ కంట్రోల్ శాఖ ఓ లేఖ రాసింది. ఆ లేఖలో పాక్ తీరును ఆండ్రియా థాంప్సన్ ప్రశ్నించారు.
ఎఫ్-16 ఫైటర్ విమానాలను దుర్వినియోగం చేసినట్లు ఆ లేఖలో ఆండ్రియా పాక్‌ను నిలదీశారు. ఫిబ్రవరిలో భారత వాయుదళం జరిపిన దాడిలో పాక్‌కు చెందిన ఎఫ్-16 నేలకూలింది. అయితే అమెరికా రాసిన లేఖలో ఆ అంశం లేకపోయినా.. పాక్ తమ ఆయుధ నియమావళిని ఉల్లంఘించినట్లు అమెరికా పేర్కొంది. పాక్ వద్ద మొత్తం 76 ఎఫ్-16 విమానాలు ఉన్న విషయం తెల్సిందే.