మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (15:35 IST)

నవాజ్ షరీఫ్‌కు షాక్: ఎన్నికల్లో పోటీకి నో.. సుప్రీం జీవిత కాల నిషేధం

పనామా పేపర్స్ కేసు నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సుప్రీం కోర్టు వేటు వేసింది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్ జీవితకాల నిషేధం విధించింది. అంతేగాకుండా ఎలాంటి బహిరంగ

పనామా పేపర్స్ కేసు నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై సుప్రీం కోర్టు వేటు వేసింది. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్ జీవితకాల నిషేధం విధించింది. అంతేగాకుండా ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనకూడదని సుప్రీం ఆదేశించింది. ఆస్తుల వివరాలను ప్రకటించడంలో నవాజ్ షరీఫ్ విఫలమయ్యారు. దీంతో గత ఏడాది పాకిస్థాన్ సుప్రీం కోర్టు నవాజ్ షరీఫ్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం నవాజ్‌పై సుప్రీం జీవిత కాల నిషేధం విధించింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ నిషేధం సరైనదేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది. షరీఫ్‌తో పాటు పాకిస్థానీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌పై కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించింది.