ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 జులై 2023 (15:24 IST)

మెక్సికోలో బస్సు ప్రమాదం.. 27మంది మృతి

road accident
మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన ఒసాకాలో, ప్రయాణీకుల బస్సు పర్వత మార్గంలో నుండి లోయలోకి పడిపోయింది. దాదాపు 27 మంది మరణించారని పోలీసులు తెలిపారు. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బాధితులను కాపాడుతున్నారు. ఇంకా 17 మంది గాయపడ్డారు. వైద్య సేవల కోసం ఈ ప్రాంతంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
 
ఒసాకా రాష్ట్ర ప్రాసిక్యూటర్ బెర్నార్డో రోడ్రిగ్జ్ అలమిల్లా మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.