బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (20:40 IST)

ఆ నదిలో నీరు 24 గంటలూ మరుగుతూనే వుంటాయట.. తెలుసా..?

Boiling River
ప్రకృతి అనేక వరాలను ప్రసాదించింది. ప్రకృతి మనిషికి ఇచ్చిన గొప్ప వరం నదులు. ప్రపంచ వ్యాప్తంగా చిన్న పెద్ద అనేక నదులున్నాయి. అయితే ఎప్పుడూ మరిగే నది గురించి తెలుసా..? ఆ నది గురించి తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్ళాల్సిందే. 
 
కెనెడా ప్రపంచంలోనే అత్యధికంగా నదులు కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. కానీ అన్ని నదుల విశిష్టతలను తలదాన్నెలా ఒక నది విశిష్టతను కలిగి ఉంది. ఆ నదిలో నీరు 24 గంటలూ మరుగుతూనే ఉంటుంది. ఈ బాయిలింగ్ నది అమెరికాలో అమెజాన్ ప్రదేశంలోని ‘పెరు’ దేశంలో మయంటుయాకు ప్రాంతంలో వుంది. 
 
అమేజాన్ ప్రదేశంలోని ‘పెరు’ దేశంలో మయంటుయా ప్రాంతంలో సముద్ర తీరంలో ఈ నది వుంది. ఆ నది నీరు 24 గంటలు వేడిగానే ఉంటుంది. అందుకనే ఈ నదిని “బాయిలింగ్ రివర్” అని అంటారు. ఈ నది అడవి మధ్యన ఉంటుంది.. అయినా నీరు 200 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిత్యం మరిగిపోతూంటుంది. 
 
ఈ నదిని 2011లో కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద థర్మల్ నది దాదాపు నాలుగు మైళ్ళ వరకు వేడిగా ప్రవహిస్తుంది. దాని వెడల్పు వద్ద 80 అడుగులు లోతు వద్ద 16 అడుగులు ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నదిలో నీరు ఏ కాలమైన వేడిగా ఉంటుందని.. ఏ జంతువు ఈ నీటిలో పడినా బతకడం కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు.