మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (13:25 IST)

సౌదీ రాజు కీలక నిర్ణయం.. కొరడా దెబ్బల శిక్షలు రద్దు

ముస్లిం చట్టాలను కఠినంగా అమలు చేసే దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. ఇక్కడ ఏ చిన్ననేరం చేసినా వారికి కొరడా దెబ్బల శిక్ష తప్పదు. ముఖ్యంగా, వివాహేతర సంబంధాలు పెట్టుకునేవారికి శిక్షలు మరింత కఠినంగా అమలు చేస్తుంటారు. అయితే ఇపుడు ఈ శిక్షలకు కాలం చెల్లింది. పాలనా సంస్కరణల్లో భాగంగా, ఆ దేశ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఈ శిక్షలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని ఆ దేశ సుప్రీంకోర్టు తెలిపింది. 
 
నిజానికి వివిధ నేరాలకు పాల్పడేవారికి కోర్టులు విధించే శిక్ష కింద కొరడా దెబ్బలు ఒక్కోసారి వందకుపైగా దాటిపోతున్నాయి. ఈ శిక్షలపై మానవ హక్కుల సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
 
ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలకు అనుగుణంగా సౌదీలో తాజా సంస్కరణ తీసుకొచ్చారు. వివాహేతర సంబంధాలు వంటి నేరాలు రుజువైనప్పుడు కోర్టులు దోషులకు కొరడా దెబ్బల శిక్షలు విధిస్తుంటాయి. 
 
ఇవి రద్దు కావడంతో ఇకపై కోర్టులు ఆయా నేరాలకు సంబంధించి జరిమానాలు లేదా జైలు శిక్ష వంటి శిక్షలను విధించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.