శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (15:10 IST)

సూపర్ మూన్.. ఏప్రిల్ 8న ఆకాశంలో అద్భుతం..

కరోనాతో ప్రపంచ ప్రజలు ఇప్పటికే భయాందోళనలకు గురవుతున్న తరుణంలో ఆకాశంలో సూపర్ మూన్ ఆవిష్కృతం కాబోతోంది. ఏప్రిల్ 8వ తేదీన అంటే వచ్చే బుధవారం పౌర్ణమి రోజున ఈ సూపర్ మూన్‌ను ఆకాశంలో వీక్షించవచ్చు. అందుకు యావత్ ప్రపంచం ఉత్సుకతతో ఎదురు చూస్తుంది. ఈ ఫుల్ మూన్‌కు ఓ స్పెషాలిటీ వుందని తెలుస్తోంది. 
 
సూపర్ మూన్ సాధారణంగా పౌర్ణమి రోజున (ఫుల్ మూన్ డే) ఏర్పడుతుంది. సాధారణ చంద్రుని పరిమాణం కంటే.. సుమారు 7 శాతం పెద్ద సైజులో.. సుమారు 15 శాతం ప్రకాశవంతంగాను కనిపిస్తుంది. అందుకే అలా కనిపించే చంద్రున్ని సూపర్ మూన్‌గా పిలుస్తారు. ఏప్రిల్ 8వ తేదీన కనిపించే సూపర్ మూన్ ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపించనుంది. 
 
చంద్రుడు భూమికి అత్యంత సమీపంలోకి వచ్చినపుడు మాత్రమే సూపర్ మూన్‌గా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడు భూమికి అత్యంత చేరువగా వచ్చే సమయం ఏప్రిల్ 8వ తేదీన ఉదయం 8 గం.ల 5 నిమిషాలకు అని శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
ఆ సమయానికి భారత్‌లో సూర్యోదయం జరిగిపోతుంది కాబట్టి చంద్రుడు కనిపించే అవకాశం లేదు. అందుకే ఏప్రిల్ 8వ తేదీన ఆవిష్కారమయ్యే సూపర్ మూన్ మన దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు.