బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 జనవరి 2022 (17:08 IST)

అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి

గల్ఫ్ దేశాల్లో ఒకటైన అబుదాబిలోని ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడులు ప్రత్యక్షంగా కాకుండా డ్రోన్ల సాయంతో జరిపారు. పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన ముస్సాఫాలో మూడు డ్రోన్ల సాయంతో యెమెన్ ఉగ్రవాదులు ఈ దాడికి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా, ఈ ఎయిర్‌పోర్టులోని మూడు ఇంధన ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు ఆయిల్ ట్యాంకర్ల నుంచి మంటలు చెలరేగాయి. అలాగే, కొత్త విమానాశ్రయ నిర్మాణ స్థలంలో మంటలు చెలరేగాయని, అబుదాబి పోలీసులు వెల్లడించారు. గత 2019, సెప్టెంబరు నెల 14వ తేదీన సౌదీ అరేబియాలో రెండు కీలక స్థావరాలపై యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఇలాంటి దాడులకు పాల్పడిన విషయం తెల్సిందే.