సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జనవరి 2022 (10:54 IST)

పాకిస్థాన్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదు

పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని పాకిస్తాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ -తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో 100 కి.మీ లోతులో భూకంప కేంద్రం నమోదై ఉందని తెలిపింది. పాకిస్థాన్‌లోని ఉత్తర ప్రాంతంలో శుక్రవారం రాత్రి భూకంపం తీవ్రత 5.6గా నమోదైంది
 
పెషావర్, మన్షేరా, బాలాకోట్, చర్సాడాతో సహా ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని అనేక నగరాల్లో ప్రకంపనలు సంభవించాయి. ఉత్తరాదిలోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో కూడా భూకంపం సంభవించింది. ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
 
అంతకుముందు జనవరి 1న పాకిస్తాన్‌లో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని ఉత్తర భాగంలో ఉన్న ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రకంపనలు ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో కూడా కనిపించాయి.