గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (14:22 IST)

బ్రా ధరించలేదని విమానం నుంచి కిందికి దించేస్తామని బెదిరింపు.. మండిపడిన మహిళ

delta air
ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది అమర్యాదగా నడుచుకున్నారు. దీంతో ఆ సిబ్బందిపై ఆ మహిళా ప్రయాణికురాలు విరుచుకుపడ్డారు. బ్రా ధరించని కారణంగా ఓ మహిళా ప్రయాణికురాలిని విమానం నుంచి కిందికి దించేస్తామని డెల్టా ఎయిర్‌లైన్స్ సిబ్బంది హెచ్చరించారు. దీంతో ఆ సిబ్బందిపై ఆమె విరుచుకుపడ్డారు. విమానం సాల్ట్ లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. టి ష్టరుపై జాకెట్ ధరిస్తేనే ప్రయాణినికి అనుమతిస్తామని ఆ మహిళా ప్రయాణికురాలిని విమాన సిబ్బంది ఒత్తిడి చేశారు. దీనికి ఆమె అంగీకరించకపోవడమే కాకుండా, విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బ్రా ధరించని కారణంగా తనను విమానం నుంచి దించేస్తామని బెదిరించారంటూ అమెరికా మహిళ ఒకరు డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది వివక్ష తప్ప మరోటి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడీ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ఆమె పేరు లిసా ఆరో బోల్డ్ (38). బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్ బ్రా ధరించకుండానే ఫ్లైట్ ఎక్కారు. తన ఎద బయటకు కనిపించనప్పటికీ కవర్ చేసుకోవాలని మహిళా సిబ్బంది కోరారని పేర్కొన్నారు. జనవరిలో ఈ ఘటన గురించి తాజాగా లాస్ ఏంజెలెస్‌లో విలేకరులకు వెల్లడించారు. ఫ్లైట్ సిబ్బంది అలా చెప్పడం తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని వాపోయారు. తాను స్త్రీని కానని భావించి తనను లక్ష్యంగా చేసుకుని వారలా ప్రవర్తించినట్టు తనకు అనిపించిందని ఆమె పేర్కొన్నారు.
 
డీజే అయిన ఆరోబోల్డ్ సాల్ట్ లేక్ సిటీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తన వస్త్రధారణ 'బహిర్గతం', 'ఆక్షేపణీయం'గా ఉందని, కాబట్టి అనుమతించబోమని సిబ్బంది తనకు చెప్పారని వివరించారు. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారని తెలిపారు. ఈ వివక్షాపూరిత విధానంపై చర్చించేందుకు కంపెనీ ప్రెసిడెంట్‌తో సమావేశం కావాలని డిమాండ్ చేస్తూ ఆరో బోల్డ్ తరపున డెల్టా ఎయిర్‌లైన్స్‌కు లేఖ రాసినట్టు న్యాయవాది గ్లోరియా ఆల్ఫ్రెడ్ తెలిపారు.
 
పురుషులు తమ టీ షర్టులను జాకెట్లతో ఎలా అయితే కప్పుకోరో, మహిళలకు కూడా అలాంటి అవసరం లేదని ఆమె వాదించారు. భద్రతాపరమైన ముప్పు ఉంటే తప్ప ప్రయాణికులను విమానం నుంచి దించకూడదని అమెరికా చట్టాలు చెబుతున్నాయని ఆల్ఫ్రెడ్ తెలిపారు. స్తనధ్వయం యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు కావని, వారు అవి కలిగి ఉండడం నేరం కాదని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై డెల్టా ఎయిర్లైన్స్ క్షమాపణలు చెప్పినట్టు తెలిసింది.