శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (15:02 IST)

ఈ టైంలో అస్సలు ఆ మాటెత్తకూడదు.. పాకిస్థాన్ ప్రధాని

భారత్‌తో పాక్ సంబంధాలు బలపడాలని, అయితే, అందుకు టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌పై తమ జట్టు గెలిచిన ఈ తరుణం సరైంది కాదని అన్నారు. ఇలాంటి టైంలో అసలు ఆ ఊసు కూడా ఎత్తకూడదన్నారు. భారత్, పాక్ మధ్య ఉన్న ఏకైక సమస్య కాశ్మీర్ మాత్రమేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను హుందాగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
 
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో నిర్వహించిన పాకిస్థాన్-సౌదీ ఇన్వెస్ట్ మెంట్ ఫోరంలో ఆయన మాట్లాడారు. చైనాతో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్ తో కూడా సంబంధాలు బలపడితే భారత్, పాక్ రెండూ శక్తిమంతమైన దేశాలుగా ఎదుగుతాయని చెప్పారు. 
 
కాశ్మీర్ ప్రజలకు 72 ఏళ్ల కిందట ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కల్పించిన హక్కుల అమలు గురించే తమ ఆందోళనంతా అని అన్నారు. వారికి ఆ హక్కులిస్తే తమకు మాట్లాడాల్సిన అవసరమే లేదన్నారు.