శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (10:00 IST)

ప్రధాని ఫ్లైట్ టార్గెట్.. యెమెన్‌లో బాంబు పేలుడు.. 22మంది మృతి

యెమన్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు బాంబు దాడులు చేశారు. కొత్తగా ఎంపికైన ప్రధాని మొయిన్ అబ్దుల్ మాలిక్, అతని మంత్రివర్గంతో కూడిన ఫ్లైట్ అదెన్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రధానికి, మంత్రి వర్గానికి స్వగతం పలికేందుకు అధికారులు, ప్రజలు విమానాశ్రయానికి చేరుకున్నారు. 
 
ప్రధాని ఫ్లైట్ నుంచి కిందకు దిగిన సమయంలో సమీపంలోనే దుండగులు బాంబుపేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లకు 22 మంది వరకు మృతి చెందగా, 50 మందికి పైగా తీవ్రగాయాలయ్యాయి. సెక్యూరిటీ సిబ్బంది ప్రధానిని, మంత్రి వర్గాన్ని సురక్షితంగా అక్కడినుంచి తప్పించారు. 
 
ఇరాన్‌కు అనుకూలంగా పనిచేస్తున్న హుతి రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రధాని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిని ఐక్యరాజ్య సమితితో పాటుగా అనేక దేశాలు ఖండించాయి.