''నామీద చాలా విమర్శలు వస్తున్నాయి. వాటికి బదులు చెప్పాల్సిన అవసరంలేదు. అవసరమైతే ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తా. అలాగే శ్రియకు నాకు ఏదో గొడవని కొన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ అబద్దాలే.. ఏదైనా నేను ముక్కుసూటిగా వుంటాను. దక్షిణాదిలో అన్ని భాషల్లోనూ నటిస్తున్నాను. చాలా ఆనందంగా వుంది. తెలుగుకంటే తమిళ కథలే నాకు నచ్చుతాయంటూ.'' హన్సిక తెలియజేస్తుంది.
సిద్ధార్థ్, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సుందర్.సి ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందించిన 'అరన్మణై 2' చిత్రాన్ని సర్వాంత రామ్ క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు సమర్పకుడుగా 'కళావతి' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. సుందర్. సి దర్శకుడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన హన్సికతో ఇంటర్వ్యూ..
ప్రశ్న: 'చంద్రకళ' కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది?
జ : 'అరణ్మని' ఆఫర్ వచ్చినపుడు నేను నటించగలనా! అనే సందేహం వుంది. అప్పుడు దర్శకుడు సుందర్ సర్ నువ్వు చేయగలవు..అని చెప్పి ప్రోత్సహించారు. నా హృదయానికి దగ్గరగా ఉండే పాత్ర అది. మొదటిసారిగా అందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాను. తెలుగులో 'చంద్రకళ' పేరుతో రిలీజ్ అయిన ఆ సినిమా మంచి హిట్ అయింది. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ఈ చిత్రంపైనా నమ్మకంముంది.
ప్రశ్న: పార్ట్-2లో ఎలా నటించారు?
జ : ఇందులో గర్భవతిగా కనిపిస్తాను. ఆ పాత్రలో మొదటిసారిగా నటిస్తున్నాను. ఎలా కూర్చోవాలి? ఎలా నడవాలి? ఇలా ప్రతి విషయంలో చాలా కేర్ తీసుకొని నటించాను. సుందర్ కొన్ని సీన్స్‌లో చాలా బాగా నటించావని చెప్పారు. ఈ సినిమాలో నేను, సుందర్ సర్ కామన్‌గా వుంటాం. మిగిలిన వారంతా కొత్త వాళ్ళే. ఇదొక హారర్, కామెడీ ఫిలిం. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీశారు. డిఫరెంట్ స్క్రిప్ట్.
ప్రశ్న: త్రిషతో గొడవలున్నాయని వార్తలు వచ్చాయి?
జ : ఇందులో మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. పూనమ్‌కి నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. ఈ సినిమా ఒప్పుకున్న దగ్గర నుండి త్రిషకు నాకు మధ్య క్యాట్ ఫైట్స్ అవుతున్నాయని బయట గాసిప్స్ వినిపిస్తున్నాయి. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. తనతో నాకు ఎప్పటినుండో మంచి పరిచయం ఉంది. తనతో నటించడం సంతోషంగా ఉంది.
ప్రశ్న: సిద్ధార్థ్‌తో ఎన్నో సినిమా?
జ : సిద్ధార్థ్, సుందర్‌లతో నాకు ఇది మూడవ సినిమా. ఇదివరకే సిద్ధార్థ్, నేను, సుందర్ సర్ కలిసి 'సంథింగ్ సంథింగ్' సినిమా చేశాం. ఈ సినిమా చేస్తున్నంత సేపు రెండో షెడ్యూల్‌లా అనిపించింది. వాళ్ళిద్దరితో కలిసి మరోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది.
ప్రశ్న: తెలుగుచిత్రాలు తగ్గించారా?
జ : లేదు. కథలు నచ్చడంలేదు. తెలుగులో కంటే నాకు తమిళంలో వచ్చే స్క్రిప్ట్స్ బాగా నచ్చుతున్నాయి. అందుకే అక్కడే ఎక్కువ చిత్రాల్లో నటిస్తున్నాను. నాకు స్క్రిప్ట్ నచ్చి డేట్స్ కుదిరితే ఖచ్చితంగా తెలుగులో కూడా నటిస్తాను. ప్రస్తుతం నాకు తెలుగు, తమిళం రెండు భాషలు అర్ధమవుతాయి. కాని మాట్లాడలేను.
ప్రశ్న: హారర్ కథలో నటించేటప్పుడు భయపడ్డారా?
జ : 13 సంవత్సరాల తరువాత నేను చూసిన హారర్ సినిమా 'చంద్రకళ'. ఆ తరువాత మరో సంవత్సరం గ్యాప్ లో 'కళావతి' చూశాను. నాకు హారర్ సినిమాలు చూడాలంటే చాలా భయం. కాని నటించగలను.
ప్రశ్న: వ్యక్తిగత విమర్శలు ఎలా స్వీకరిస్తారు?
జ : వృత్తిపరంగా ఏవైనా తప్పులుంటే స్వీకరిస్తాను. కానీ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడడం నచ్చదు. గాసిప్స్ మాట్లాడుకునే వాళ్ళు చాలా అనుకుంటారు. కాని అందులో నిజం ఉండదు. నా మీద వచ్చే గాసిప్స్‌ను క్లియర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. చేయాలనుకుంటే నా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తాను.
ప్రశ్న: పెయింటింగ్ కూడా వేస్తారా?
జ : ఖాళీ సమయాల్లో పెయింటింగ్ చేయడం నా హాబీ. రీసెంట్ గా ఆరడుగుల గురునానక్ ఫోటో పెయింటింగ్ వేశాను. అది మా అమ్మకు గిఫ్ట్‌గా ఇచ్చాను.
ప్రశ్న: తదుపరి చిత్రాలు?
జ : ప్రస్తుతం తమిళంలో నాలుగు ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. తెలుగులో ఇంకా ఏది మెటీరియలైజ్ కాలేదు అని చెప్పారు.