శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (08:59 IST)

పదివేల పరుగుల క్లబ్‌లో గేల్: తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రపంచ రికార్డు

ఐపీఎల్ 10 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఊరించిన కల సాకారమైంది. టీ20 క్రికెట్ బాహుబలి క్రిస్ గేల్ అనితరసాధ్యమైన రికార్డును తన కైవసం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్

ఐపీఎల్ 10 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఊరించిన కల సాకారమైంది. టీ20 క్రికెట్ బాహుబలి క్రిస్ గేల్ అనితరసాధ్యమైన రికార్డును తన కైవసం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తొలి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు.  ఇంకా మూడు పరుగులు చేస్తే పది వేల పరుగులు పూర్తి చేస్తాడనగా బ్యాటింగ్‌కు దిగిన గేల్ మూడు సింగిల్స్ తీసి ఆ మైలురాయిని చేరుకున్నాడు. లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు తరుపున ఆడుతుండగా గేల్ ఈ ఘనతను సాధించాడు.
 
టీ20 క్రికెట్‌లో రికార్డులన్నీ గేల్ తన పేరునే లిఖించుకున్నాడు. అత్యధిక పరుగులు, సిక్సర్లు, ఫోర్లు ఇలా అన్నీ గేల్ పేరునే ఉన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో గేల్ చెలరేగి ఆడాడు. 5 ఫోర్లు 7 సిక్సర్లతో 38 బంతుల్లోనే 77 పరుగులు చేసి బసిల్ తంపి బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా ఔటయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 21 పరుగుల తేడాతో నెగ్గింది. టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుతో చెలరేగిన గేల్ మూడు పరాజయాల తర్వాత ఆర్‌సీబీకి తొలి విజయం సాధించిపెట్టాడు.