శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 9 మే 2017 (11:15 IST)

ముంబై ఇండియన్స్‌‌పై సన్ రైజర్స్ అద్బుత విజయం. ప్లేఆఫ్‌లో నిలిచిన ఆశలు

సొంత మైదానం ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్ రేసులో నిలబడింది. శిఖర్ ధావన్ 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్థశతకంతో ర

సొంత మైదానం ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్ రేసులో నిలబడింది. శిఖర్ ధావన్ 46 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్థశతకంతో రాణించడంతో ముంబై ఇండియన్స్ విధించిన 139 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కొల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్‌ను హైదరాబాద్‌ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 138 పరుగులు చేసింది. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్‌ అవకాశాలు మెరుగయ్యాయి. 
 
ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతయ్యే స్థితిలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సొంతగడ్డపై తమ బలాన్ని ప్రదర్శించింది. ముందు బౌలింగ్‌లో, ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సమష్టి ప్రదర్శనతో పటిష్ట ముంబైని కంగుతినిపించింది. ఫలితంగా లీగ్‌లో ముందుకెళ్లే అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో నెగ్గి సీజన్‌లో సొంత మైదానంలో తమ విజయాల రికార్డును 6–1తో ముగించింది.  
 
39 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ రెండో ఓవర్‌ మొదటి బంతికే జట్టు స్కోరు 7 పరుగుల వద్ద కెప్టెన్‌ వార్నర్‌(6) వికెట్‌ను కోల్పోయింది. మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. హెన్రిక్స్‌(44: 35 బంతుల్లో 6×4)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. బుమ్రా వేసిన 13 ఓవర్‌ మొదటి బంతికి రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి హెన్రిక్స్‌ వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌(9) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్‌ చేరాడు. ఈ సమయంలో విజయ్‌ శంకర్‌( 15 నాటౌట్‌)తో కలిసి ధావన్‌ గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.
 
ఐపీఎల్‌లో అధికారికంగా ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్‌ మాత్రమే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న కోల్‌కతా, పుణే కూడా దాదాపుగా ముందుకు వెళ్లినట్లే. తాజా విజయంతో సన్‌రైజర్స్‌ 15 పాయింట్లతో తమ నాలుగో స్థానాన్ని నిలబెట్టుకోగా...  గుజరాత్‌పై చివరి మ్యాచ్‌ కూడా గెలిస్తే ఎలాంటి లెక్కల అవసరం లేకుండా 17 పాయింట్లతో సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌కు వెళుతుంది. హైదరాబాద్‌ను దాటి పంజాబ్‌ ముందుకు వెళ్లాలంటే అది తమ మిగిలిన మూడు మ్యాచ్‌లలో కూడా తప్పనిసరిగా విజయం సా«ధించాల్సి ఉంటుంది. అది అంత సులువు కాదు కాబట్టి హైదరాబాద్‌కు ప్రమాదం ఉండకపోవచ్చు.