శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 11 మే 2017 (12:54 IST)

బంతి కాచుకున్నాడు.. రనౌట్ అయ్యాడు.. షాక్‌లో స్టేడియం

బంతిని కాచుకుని కూడా అదే బంతికి ఔటయితే ఆ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అంతకంటే మిన్నగా తమ అభిమాన ఆటగాడు అనూహ్యంగా ఔట్ కావడం చూసి కాన్పూర్ స్టేడియం మూగపోయింది. ఒక్క క్షణం ఏమారి

బంతిని కాచుకుని కూడా అదే బంతికి ఔటయితే ఆ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ అంతకంటే మిన్నగా తమ అభిమాన ఆటగాడు అనూహ్యంగా ఔట్ కావడం చూసి కాన్పూర్ స్టేడియం మూగపోయింది. ఒక్క క్షణం ఏమారితే ఏమవుతుందో ఆ ఆటగాడికి క్రికెట్ మైదానం సాక్షిగా చక్కటి పాఠం లభించింది. 
 
గుజరాత్ లయన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ కు వింత అనుభవం ఎదురైంది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ప్రదీప్ సంగ్వన్ శాంసన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ వచ్చిరావడంతోనే ఫోర్ కొట్టాడు. మరుసటి బంతిని ఆడబోయిన రిషబ్ వింతగా రనౌటై అందరినీ ఆశ్చర్యపర్చాడు. 
 
ఇంతకూ ఏం జరిగిందంటే లెగ్ సైడ్ ఆడబోయిన పంత్ బంతి ప్యాడ్‌కు తగలడంతో సంగ్వన్ అప్పీల్ చేశాడు. వెంటనే బంతిని అందుకున్న సురేశ్ రైనా వికెట్ల వైపు విసరడంతో నేరుగా తగిలింది. పంత్ క్రీజులో లేక పోవడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ఇది కనురెప్పపాటులో జరగడంతో స్టేడియం అంతా హతాశులయ్యారు. అంపైర్ దర్ఢ్ ఎంపైర్‌కి నివేదించినా రిషబ్ క్రీజు నుంచి వెనుదిరిగాడు. రిషబ్ గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సునామి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించిన విషయం తెలిసిందే.