ఇక్కడ ప్రత్యర్థితో.. అక్కడ ఆమెతో రోహిత్ శర్మ ఊహించని షాట్లు... రితికా షాక్ (Video)
భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2017 పదో అంచె పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టు సారథి. ఈ సీజన్‌లో సారథిగానేకాకుండా ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా మైదానంలో బ్యాట్‌తో అమితంగా రా
భారత క్రికెటర్ రోహిత్ శర్మ. ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2017 పదో అంచె పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టు సారథి. ఈ సీజన్‌లో సారథిగానేకాకుండా ఓ బ్యాట్స్‌మెన్‌గా కూడా మైదానంలో బ్యాట్‌తో అమితంగా రాణిస్తున్నాడు. అలాగే, ఇండోర్ స్టేడియంలో భార్యతో టేబుల్ టెన్నిస్ (టీటీ) ఆడుతూ అదరగొడుతున్నాడు.
ఐపీఎల్ సీజన్‌లో ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా తన కుటుంబ సభ్యులతో కలసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన భార్య రితికాతో టేబుల్ టెన్నిస్ గేమ్ ఆడాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్ట్రాగ్రాం ఖాతా ద్వారా వెల్లడించాడు.
తన భార్యతో పెట్టుకున్న ఈ పోటీలో రోహిత్ శర్మ చివర్లో ఊహించని షాట్ కొట్టి గెలిచాడు. పోటీలో భార్యపై గెలిచినందుకు సంబరపడిపోయాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశాడు.