శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (20:48 IST)

వైరల్ అవుతున్న మ్యాంగో మ్యాన్.. కోహ్లీ ఫ్యాన్స్‌పై ఫైర్

Mangoes man
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా లక్నో తరపున ఆడుతున్న ఆప్ఘన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మరోసారి కోహ్లీ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యారు. ప్లే ఆఫ్‌లో భాగంగా బుధవారం రాత్రి లక్నో-ముంబై మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో ఓడిన తర్వాత నవీన్‌ను నెటిజన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడిని ట్రోల్ చేస్తున్నారు. 
 
నవీన్ ఉల్ హక్‌ను ముంబై ప్లేయర్స్‌తో పాటు జొమాటో, సిగ్గీలు కూడా ఆటాడుకున్నాయి. ముంబై-ఆర్సీబీ మ్యాచ్‌లో కోహ్లీ ఔటయ్యాక ముంబై మ్యాచ్‌ను చూస్తూ ఓ గిన్నెలో మామిడి పండ్లను షేర్ చేస్తూ.. స్వీట్ మ్యాంగోస్ అని నవీన్ ఉల్ హక్ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. 
 
ఇక అప్పటి నుంచి అతన్నీ.. కోహ్లీతో పాటు దాదాపు ప్రతీ ఇండియన్ ఫ్యాన్ ట్రోలింగ్ చేస్తున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో నవీన్.. నాలుగు వికెట్లు తీసిన తర్వాత కేఎల్ రాహుల్ స్టైల్‌లో సెలెబ్రేషన్స్ చేసుకోవడం మరింత కోపం తెప్పింది.