బుధవారం, 1 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 28 మే 2022 (23:14 IST)

టీ20 ఫైనల్స్‌లో గుజరాత్ టైటాన్స్: అబ్బే నాకేం సంతోషంగా లేదంటున్న మాథ్యూ

Matthew Wade
హిమాలయ శిఖరాలను అధిరోహించినా సంతోషం లేదు, ప్రపంచంలోని కుబేరుల జాబితాలో చోటు దక్కినా కిక్ లేదు అని చెప్తుంటారు కొందరు. అలాగే వుంది గుజరాత్ టైటాన్స్ ఆటగాడు మాథ్యూ వేడ్ వ్యవహారం.

 
గుజరాత్ జట్టు ఫైనల్‌కి చేరడంపై మాథ్యూ ఇంటెరెస్టింగ్ కామెంట్ చేసాడు. తనకు వ్యక్తిగతంగా ఈ సీజన్ చాలా చాలా చికాకు కల్పింస్తోందన్నాడు. టీ20 లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ కి దూసుకొచ్చింది. సహజంగా ఫైనల్ కి వస్తే ఎవరైనా ఎంతో ఆనందాన్ని వెలిబుచ్చుతారు. కానీ మాథ్యూ మాత్రం డిఫిరెంటుగా స్పందించాడు. దీనికి కారణం ఏంటో తెలియాలి మరి.

 
కాగా రేపు ఆదివారం నాడు గుజరాత్-రాజస్థాన్ జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే... అరంగేట్రంతోనే గుజరాత్ జట్టు మేటి జట్లను మట్టికరిపించి ఫైనల్ కి చేరుకుంది. టైటిల్ కూడా ఎగరేసుకెళ్లిందంటే రికార్డ్ అవుతుంది.