రైజింగ్ పుణె జట్టును పైకి లేపిందీ, కొంప ముంచిందీ ధోనీయేనా..

ఏ ఫార్మాట్‌లో అయినా సరే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తూ చివరిక్షణంలో చేజింగుతో విజయాన్ని అవలీలగా ఎగరేసుకుపోయే ఆ అరుదైన అనుభవం ఆదివారం రాత్రి పనిచేయలేదు. క్రికెట్ ప్రపంచంలోనే అద్వితీయమైన మ్యాచ్ ఫి

హైదరాబాద్| Raju| Last Updated: సోమవారం, 22 మే 2017 (09:52 IST)
ఏ ఫార్మాట్‌లో అయినా సరే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తూ చివరిక్షణంలో చేజింగుతో విజయాన్ని అవలీలగా ఎగరేసుకుపోయే ఆ అరుదైన అనుభవం ఆదివారం
రాత్రి పనిచేయలేదు. క్రికెట్ ప్రపంచంలోనే అద్వితీయమైన మ్యాచ్ ఫినిషర్‌గా పదేళ్లపాటు తన ప్రతిభ చూపిన ఆ గొప్ప క్రికెటర్ ఉప్పల్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలవంచాడు. కీలకసమయాల్లో రెండు సార్లు ఆదుకుని పుణెను ఎవరూ ఉూహించని విధంగా ఫైనల్ చేర్చిన సీనియర్ ఆడగాడు చేతులారా జట్టును ఓటమి కోరల్లోకి నెట్టాడు. ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని..

క్వాలిఫయర్-1 లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన మహేంద్రుడు ఫైనల్ మ్యాచ్ లో
మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. స్వల్ప లక్ష్యాన్ని ఎదుర్కొలేక అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఒక్క పరుగుతో పుణె పై గెలిచిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ లో తొలి నుంచి విజయ అవకాశం పుణే వైపు ఉన్న ధోని అవుటవ్వడంతో ఒక్కసారిగా ముంబై పట్టు సాధించింది.

10 ఓవర్ల వరకు ఫైనల్ పోటీలో గెలుపు పుణే జట్టువైపే మొగ్గు చూపింది. కానీ అజింక్యా రహానే అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్ తో ఆచితూచి ఆడాడు. ఇదే పుణేను కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. కేవలం ఓవర్ కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఎన్నడూ లేనిది తీవ్ర ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహజమైన ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు.

ధోనీకి తోడుగా అటు స్మిత్ కూడా
వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం.
పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ధోని అవుట్ తో పట్టు సాధించిన ముంబై పుణె కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి బంతికి సిక్స్ కొట్టి
ధోనీ గెలిపించిన సందర్భాలెన్నో.. అలాంటి డేంజరేస్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం మంచి వ్యూహంతో ఆ బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది.

కళ్లముందు దోబోచులాడిన విజయం ఒక చిన్న పొరపాటుకు గాను దూరమైన క్షణాన్ని జీర్ణ చేసుకోలేని పుణె జట్టు జట్టుగా భోరున విలపించడం ఐపీఎల్‌ 10కి విషాద ముగింపు పలికింది. స్తిత ప్రజ్ఞుడు స్టీవ్ స్మిత్ సైతం కళ్లముందు సంభవించిన పరాభవాన్ని చూసి తల్లఢిల్లిపోయిన వైనం చూసి ప్రేక్షకులే కంట తడిపెట్టారంటే ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియం రేపిన భావోద్వేగాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ధోనీ అవుట్ కాకుండా ఉంటే, స్మిత్ చివర్లో ఆ తప్పు షాట్ కొట్టకపోయి ఉంటే.. ఈ ఇఫ్ అండ్ నాట్ భాషను క్రికెట్ పట్టించుకోదు.. విషాదకమైన ఓటమిని భరించాల్సిందే. జట్టులోని ఇద్దరు మేటి ఆటగాళ్లు స్వయంగా జట్టు ఓటమికి కారణం కావడమే అత్యంత విషాదకరం.
దీనిపై మరింత చదవండి :