శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ఇస్లాం
Written By venu
Last Modified: శుక్రవారం, 26 మే 2017 (15:02 IST)

రంజాన్ మాసంలో పాటించాల్సిన నియమాలు....

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ముస్లిములకు మహ్మద్ ప్రవక్త ఖురాన్‌ను అందించిన పవిత్ర మాసమే రంజాన్. సాధారణంగా రంజాన్ మాసం అంటే అందరికీ తెలిసింది ముస్లిమ్ సోదరులు ఆచరించే కఠిన ఉపవాసం. కానీ ఈ రంజాన్ మాసంలో ప్రార్థనతో పాటు, ఖురాన్ పఠనం, ఆత్మపరిశీలన

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైపోయింది. ముస్లిములకు మహ్మద్ ప్రవక్త ఖురాన్‌ను అందించిన పవిత్ర మాసమే రంజాన్. సాధారణంగా రంజాన్ మాసం అంటే అందరికీ తెలిసింది ముస్లిమ్ సోదరులు ఆచరించే కఠిన ఉపవాసం. కానీ ఈ రంజాన్ మాసంలో ప్రార్థనతో పాటు, ఖురాన్ పఠనం, ఆత్మపరిశీలన అనేవి కూడా చాలా ముఖ్యమైనవి. 
 
రంజాన్ ఉపవాసం చేసేవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పాటించవలసిన కొన్ని నియమాలు:
 
మితంగా భోజనం చేయడం - సాధారణంగా రంజాన్ ఉపవాసాన్ని ముగించేటప్పుడు ఖర్జూరాలను తీసుకోవాలి. ఇందులో పీచు పదార్థం ఉండటమే కాకుండా, నెమ్మదిగా జీర్ణమై రోజంతా శక్తిని అందిస్తూ ఉంటుంది. కూరగాయలు, దినుసులతో పాటు అప్రికాట్లు, అత్తిపండ్లను కూడా తీసుకోండి.
 
తగినంత విశ్రాంతి తీసుకోవడం - రంజాన్ సమయంలో రాత్రిళ్లు బాగా నిద్రపోతే మంచిది. కనీసం ఒక రోజుకు 6 నుండి 8 గంటల నిద్ర అవసరం. సుహూర్ కోసం సూర్యోదయం కంటే ముందే లేవవలసి ఉండటంతో ఇది సాధ్యం కాకపోవచ్చు. డీహైడ్రేషన్, దప్పిక బారిన పడకుండా తప్పించుకునేందుకు చల్లని ప్రదేశాల్లో ఉండటం లేదా ఎండల్లో ఎక్కువగా తిరగకపోవడం ఉత్తమం.
 
డీహైడ్రేషన్ నుండి రక్షణ - ఇఫ్తార్ నుండి సుహూర్ మధ్యలో కనీసం 8 గ్లాసుల మంచినీరు తాగండి. ఏదైనా బాటిల్ ఉపయోగించి నీరు తాగడం ద్వారా ఎన్ని నీరు తాగుతున్నారో కొలుచుకోండి. అలాగే సూప్‌లు, పాలు, పళ్లరసాలను తీసుకోండి. కెఫైన్ ఉండే కాఫీ, టీ లేదా కార్బొనేటెడ్ పానీయాలైన కోక్ ఇతర పానీయాలను తీసుకోకండి.
 
కొద్దిగా వ్యాయామమూ అవసరమే - మీ దైనందిన వ్యాయామం చేయకుండా ఉండేందుకు మీరు చేసే ఉపవాసాన్ని ఓ సాకుగా చూపకండి. జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేసే బదులుగా యోగా, శరీరం అలసిపోకుండా కొద్ది దూరం నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు.