సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (13:34 IST)

భారత్‌లో అందరూ వాడే కామన్ పాస్‌వర్డ్ ఏదో తెలుసా?

password
భారత్‌లో అందరూ వాడే కామన్ పాస్‌వర్డ్ ఏంటో తాజాగా వెల్లడైంది. ప్రపంచంలో మూడో వంతు నెటిజన్లు ఇదే పాస్‌వర్డ్‌ను వినియోగిస్తున్నట్టు నార్డ్‌పాస్ అనే సంస్థ తాజాగా వెల్లడించిన నివేదికలో వెల్లడైంది. ఇటీవలికాలంలో సైబర్ నేరాలు భారీగా పెరిగిపోయాయి. దానికి అసలు కారణం ఏంటో తెలుసుకునేందుకు నార్డ్‌పాస్ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. ఈ సైబర్ నేరాలకు ప్రధాన కారణం బలహీమైన పాస్‌వర్డ్‌లు అని తేల్చింది. 
 
భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది కామన్‌గా ఉపయోగించే పాస్‌వర్డ్ "123456"గా అని తేలింది. ఇది నమ్మడానికి ఆశ్యర్యంగా అనిపించినా ఇది నిజం. పాస్‌వర్డ్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ కంపెనీ నార్డ్‌పాస్ తాజాగా వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 
 
ఈ యేడాది '1213456' అనేది భారత్‌లో కామన్ పాస్‌వర్డ్‌గా మారిందని తెలిపింది. అంతేకాదు.. ప్రపంచంలో మూడోవంతు అంటే 31 శాతం మంది నెటిజన్లు ఉపయోగించే పాస్‌వర్డ్‌లలో '123456789' లేదా '12345', '00000' వంటి పూర్తిగా వరుస నంబర్లు ఉన్నట్టు నివేదిక వివరించింది.
 
ఇంటర్నెట్ యూజర్లు కూడా తమ ప్రాంతాలను సూచించే పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటున్నట్టు వెల్లడించింది. ఇలాంటి వాటిలో "India@123" అనేది అత్యధిక మంది వినియోగిస్తున్నారు. అలాగే, 'barceelona' అనేది స్పెయిన్‌లో ట్రెండింగ్‌లో ఉంటే గ్రీస్‌లో 'kalamata' అనేది చాలా కామన్ పాస్‌వర్డ్‌గా మారింది. ప్రజలు తమ స్ట్రీమింగ్ ఖాతాలకు అత్యంత బలహీన పాస్‌వర్డ్‌లు పెట్టుకుంటున్నట్టు నార్డ్‌పాస్ సిటీవో థామస్ స్మాలకీస్ వెల్లడించారు.