బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (13:29 IST)

భారత్‌లో 5జీ ఫోన్లకు గిరాకీ.. అయితే స్మార్ట్ ఫోన్‌ షిప్‌మెంట్ పడిపోయిందిగా..!

Nokia 5G Smartphones
భారత్‌లో 5జీ ఫోన్లకు గిరాకీ బాగా ఉన్నట్లు మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ తాజాగా తేల్చింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల షిప్‌మెంట్లతో 5జీ ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగినట్లు సంస్థ అధ్యయనంలో తేల్చింది. 5జీ ఫోన్లలో చౌక ధరల ఫోన్లకే మంచి డిమాండ్ ఉన్నట్టు సంస్థ పేర్కొంది. 
 
అయితే మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్ల సంఖ్య 16 శాతం తగ్గి 3.1 కోట్లుగా నమోదైంది. రియల్‌మీ, షావొమీ ఫోన్లు సంఖ్యలో అధిక క్షీణత కనిపించింది. ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉందని ఐడీసీ వెల్లడించింది.
 
అంతేగాకుండా.. భారతదేశం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్‌మెంట్‌లు Q1 2023లో 21 శాతం (సంవత్సరానికి) తగ్గాయి. అయితే దేశంలో మొత్తం మొబైల్ మార్కెట్ 20 శాతం (సంవత్సరానికి) క్షీణించింది.