గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 జులై 2021 (22:10 IST)

ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త.. ఎయిర్‌టెల్ బ్లాక్ లాంఛ్

ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త. పోస్ట్‌పెయిడ్, డైరెక్ట్ టు హోం (డీటీహెచ్), ఫైబర్ సర్వీసులను ఎయిర్‌టెల్ ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చింది. అంటే ఇకపై ఇవన్నీ ఒకే బిల్లుపై లభిస్తాయన్నమాట. ఎయిర్ టెల్ తాజాగా 'ఎయిర్‌టెల్ బ్లాక్'ను లాంచ్ చేసింది. ఇందులో పలు ప్లాన్లు ఉన్నాయి. ఇవి నచ్చని వారు సొంతంగా తామే ఓ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్లు రూ. 998 నుంచి మొదలవుతాయి. 
 
ఎయిర్‌టెల్ బ్లాక్ నేటి నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక డీటీహెచ్ కనెక్షన్, రెండు పోస్టుపెయిడ్ మొబైల్ కనెక్షన్లు నెలకు రూ. 998తో లభిస్తాయి. మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్ రూ. 1,349తో అందుబాటులో ఉంది. 
 
అలాగే, ఒక ఫైబర్ కనెక్షన్, రెండు పోస్టు పెయిడ్ మొబైల్ కనెక్షన్లను రూ. 1,598 ప్యాక్‌తో లభిస్తాయి. ఇందులో టాప్ ఎండ్ ప్లాన్ విలువ రూ. 2,099. ఇందులో మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ నెల రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది.
 
ఈ ఫిక్స్‌డ్ ప్లాన్లు అనువుగా లేవనుకుంటే ఎవరికి వారే రెండు అంతకంటే ఎక్కువ సేవలతో ఓ సొంత ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులకు వర్తించదు.