గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (22:17 IST)

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ చౌక ఆఫర్: రూ.19లకు రీఛార్జ్ చేసుకుంటే..?

జియో దెబ్బకు ఎయిర్‌టెల్ చౌక ఆఫర్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఓ చౌక ధర రీచార్జ్ ప్లాన్ అందుబాటులో ఉంది. ధర కేవలం రూ. 19 మాత్రమే. ఈ ప్లాన్‌తో రీ చార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. 
 
ఎయిర్‌టెల్ తాజాగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్‌తో మొబైల్ నెంబర్ రీచార్జ్ చేసుకుంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ రెండు రోజులు మాత్రమే. ఎయిర్‌టెల్ ఈ రీచార్జ్ ప్లాన్‌ను 'ట్రూలీ అన్‌లిమిటెడ్' కేటగిరి కింద ఉంచింది. 
 
అంటే ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చని అర్థం. మొత్తంమీద... రూ.19కే అన్‌లిమిటెడ్ కాల్స్ అనేది చెప్పుకోదగిన అంశమేనన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇక 200 ఎంబీ డేటా కూడా వస్తుంది.
 
అంతేకాదు ప్రతీ నెలా, లేదంటే మూడు నెలలకు ఒకసారి రీచార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఒకేసారి సంవత్సరానికి రీచార్జ్ చేసుకోవచ్చు. రూ. 2698 ప్లాన్ అందుబాటులో ఉంది. దీని వాలిడిటీ 365 రోజులు. రోజుకు 2 జీబీ డేటా వస్తుంది. దీంతోపాటు... డిస్నీ హాట్‌స్టర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగానే లభించనుంది.