శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 మార్చి 2023 (14:45 IST)

మీమ్స్ ఆఫీసర్‌‌గా చేరితే నెలకు రూ.లక్ష జీతం.. స్టాక్ బ్రో ఆఫర్

మీమ్స్‌కు యువతలో యామా క్రేజ్ ఉంది. ఇప్పటికే రాజకీయ ప్రచారాల్లో, వ్యాపార ప్రకటనల్లో ఈ ట్రెండ్ కొనసాగుతోంది. యువత నాడిని పట్టేసిన ఓ బెంగళూరు కంపెనీ మీమ్స్ చేసేవారికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమైంది. తమ సంస్థలో చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌‌గా చేరితే నెలకు రూ.లక్ష ఇస్తామని బంపర్ ఆఫర్ ఇస్తూ ప్రకటించింది. 
 
లింక్డ్‌ఇన్‌లో స్టాక్ బ్రో అనే స్టార్టప్ చేసిన ఈ ప్రకటన నెట్టింట వైరల్‌గా మారింది. జెన్‌జెడ్ యువత ప్రస్తుతం కొత్త విషయాలను మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారని సంస్థ పేర్కొంది. కాబట్టి.. మీమ్స్ నిపుణుడిని చీఫ్ మీమ్స్ ఆఫీసర్‌గా నియమించుకునేందుకు సిద్ధమయ్యామని వెల్లడించింది.