సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 అక్టోబరు 2018 (18:46 IST)

బ్లాక్‌బెర్రీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్- ధర రూ.29,990

ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ కి2 ఎల్ఈని భారత మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ సోమవారం విడుదల చేసింది

ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీ సంస్థ బ్లాక్‌బెర్రీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్ కి2 ఎల్ఈని భారత మార్కెట్లోకి బ్లాక్ బెర్రీ సోమవారం విడుదల చేసింది. దీని ధర రూ.29,990. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు అమేజాన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానుంది. 
 
ఇక 4.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే కలిగిన బ్లాక్‌బెర్రీ కీ2 ఎల్‌ఇ ఫోన్‌లో వున్న ఫీచర్లను ఓసారి పరిశీలిస్తే.. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్‌ను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
అంతేగాకుండా.. 1080 x 1620 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 64 జిబి స్టోరేజ్, 256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13లతో పాటు డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0ను కలిగి వుంటుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 
ఇంకా ఎలాంటి ఫీచర్లు వున్నాయంటే..
3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 
క్విక్ చార్జ్ 3.0
ఎల్‌ఈ, 
ఎన్‌ఎఫ్‌సి,
యూఎస్‌బి టైప్ సి,
ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి అద్భుత ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్‌ కలిగివుంది. ఉన్నాయి.