శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:15 IST)

వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చు.. ఫేస్‌బుక్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు ఇప్పట్లో ఆఫీస్‌కు రానవసరం లేదని, వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చునని ప్రకటించింది. అంతేకాదు ఆఫీస్ అవసరాల కోసం వెయ్యి డాలర్లు ఇస్తామని కూడా తెలిపింది. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్య నిపుణులు, ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. 
 
2021, జూలై వరకు ఇంటి నుంచే పనీచేసుకోవచ్చని, ఇంట్లో ఆఫీస్ అవసరాల నిమిత్తం రూ.74,983 (వెయ్యి డాలర్లు) చెల్లిస్తామని ఎఫ్‌బీ అధికారులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పలుచోట్ల ఆఫీసులను నడిపిస్తున్నామని వెల్లడించారు. కరోనా కేసులు పెరగుతుండటంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని చెప్పారు.