గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (11:16 IST)

ఫేస్‌బుక్ యూజర్లకు కొత్త అనుభూతి.. పేజ్‌ లేవుట్‌లో మార్పులు

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకి సరికొత్త హంగులతో యూజర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ పేజ్‌ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. 
 
గతేడాదే ఈ ఫీచర్స్‌ని ఫేస్‌బుక్‌లో పాపులర్‌ అయిన వ్యక్తులు, నటీనటులు, రచయితలు, క్రియేటర్స్‌తో పా టు పలు వాణిజ్య పేజీల ద్వారా పరీక్షించారు. త్వరలో ఈ మార్పులు యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు. 
 
ఫేస్‌బుక్‌లో పర్సనల్‌ ప్రొఫైల్‌, పబ్లిక్‌ పేజ్‌కి మధ్య అనుసంధానం మరింత సులభంగా ఉండేలా మార్పులు చేయనున్నట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది. ఇందుకోసం ప్రొఫైల్‌, పబ్లిక్‌ పేజ్‌ ఇంటర్‌ ఫేస్‌ను రీడిజైన్‌ చేస్తున్నారు. దాని వల్ల యూజర్స్‌ ప్రొఫైల్‌, పేజ్‌ పోస్టులను సులభంగా మారొచ్చు.