మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (12:16 IST)

ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్: స్మార్ట్ ఫోన్లపై మొబైల్ బొనాంజా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ-కామెర్స్ దిగ్గజం ఫ్లిఫ్ కార్ట్ కొత్త డీల్స్ ప్రకటించింది. ఈ డీల్స్‌ ప్రకారం పలు స్మార్ట్ ఫోన్లపై ధరలను తగ్గించింది. ఇందులో భాగంగా గూగుల్ పిక్సెల్ ధర రూ.20వేలకు పైగా తగ్గింది. ఆకర్షణీయ ఆఫర్లతో కూడిన మొబైల్ బొనాంజాలో కస్టమర్లు స్మార్ట్ ఫోన్లను భారీగా కొనుగోలు చేస్తున్నారు. 
 
క్సియోమీ ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్ మీ నోట్ 4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై ఫ్లిఫ్ కార్ట్ ప్రత్యేక తగ్గింపును అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా కొనుగోలు చేసిన ఫోన్లకు బై బ్యాక్ గ్యారెంటీతో పాటు రూ.833లను చెల్లించే ఈఎంఐ సౌకర్యం కూడా కల్పించింది. 
 
రూ. 13,999 ధర ఉన్న ఎంఐ ఏ1 ను రూ. 12,999కి అందిస్తామని, రూ. 61 వేల ధర ఉన్న గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్ రూ. 39,999కి లభ్యమవుతుందని, హెచ్డీఎఫ్సీ కార్డుపై కొనుగోలు చేస్తే, మరో రూ. 8 వేల రాయితీ లభిస్తుందని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది.