ఫ్లిప్‌కార్ట్‌ తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.. ఫీచర్లేంటంటే...

ఇప్పటివరకు కొరియర్ సంస్థగా పనిచేసిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. క్యాప్చర్‌ ప్లస్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫోన్

Flipkart's Billion Capture smart phone
pnr| Last Updated: శుక్రవారం, 10 నవంబరు 2017 (14:54 IST)
ఇప్పటివరకు కొరియర్ సంస్థగా పనిచేసిన ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ తన తొలి బ్రిలియంట్‌ బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. క్యాప్చర్‌ ప్లస్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫోన్ ఈనెల 15వ తేదీ నుంచి అమ్మకానికి రాబోతుంది. ఇందులో పొందుపరిచిన ఫీచర్లు కూడా ఇతర స్మార్ట్ ఫోన్లకు ధీటుగా ఉండటం గమనార్హం.

ఈ స్మార్ట్‌ఫోన్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. స్పీడ్‌గా ఛార్జింగ్‌ చేసుకునే సౌలభ్యం ఇందులో ఉంది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ లాంచ్‌ చేసింది. ఒకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 10,999 రూపాయలు. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌. దీని ధర 12,999 రూపాయలు. మైస్టిక్‌ బ్లాక్‌, డిసర్ట్‌ గోల్డ్‌ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది.

ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే, డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు, ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు, అన్‌లిమిటెడ్ క్లౌడ్‌ స్టోరేజ్‌‌లతో పాటు ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 625 ఎస్‌ఓసీ, ఆండ్రాయిడ్‌ 7.1.2 నోగట్‌, 5.5 ఇన్ చెస్ ఫుల్‌-హెచ్డీ డిస్‌ప్లే, 3జీబీ, 4జీపీ ర్యామ్‌, 128జీబీ వరకు విస్తరణ మెమరీ, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 13 మెగాపిక్సెల్‌తో వెనుకవైపు రెండు కెమెరాలు, 8 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరాలను అమర్చారు.దీనిపై మరింత చదవండి :