బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (16:05 IST)

పానాసోనిక్ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్.. ధర రూ.8999

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. 'ఎలూగా ఐ5' పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.8999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఈ-మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో

ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్ సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. 'ఎలూగా ఐ5' పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్ ధర రూ.8999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఈ-మార్కెటింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పానాసోనిక్ షోరూమ్‌లలో కూడా లభించనున్నాయి. బంగారు, నలుపు రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే... 
 
ఐదు అంగుళాల హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, ఆసాహి డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.25 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర అత్యాధునిక ఫీచర్లతో తయారు చేశారు.