గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (11:13 IST)

జియోనీ మ్యాక్స్ పేరిట.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఆగస్టు 25న విడుదల

Gionee F9 Plus
జియోనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు భారత్‌ మార్కెట్లోకి రానున్నాయి. జియోనీ మ్యాక్స్ అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక పేజీ ద్వారా తెలిపింది. ఈ ఫోను ధర రూ.6వేలుగా వుండొచ్చునని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో జియోనీ ఎఫ్9 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ జియోనీ నుంచి రాలేదు.
 
తాజాగా జియోనీ మ్యాక్స్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ దీనికి సంబంధించిన టీజర్ పేజీని కూడా తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఆగస్టు 25వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నేరుగా ఫ్లిప్ కార్ట్‌లోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఫ్లిప్ కార్ట్ షేర్ చేసింది. 
 
ఫీచర్లు ఏంటంటే?
వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే
4500 ఎంఏహెచ్ బ్యాటరీ వుంటుందని తెలుస్తోంది.